పెట్రోల్ బంకుల్లో ఐదు కేజీల సిలిండర్ల అమ్మకానికి పెట్రోలియం శాఖ ఆమోదం
పెట్రోల్ బంకుల్లో ఐదు కిలోల రాయితీయేతర సిలిండర్ల అమ్మకం ప్రతిపాదనకు పెట్రోలియం శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు దేశ వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో సిలిండర్లు అమ్మనున్నారు. కాగా, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఆమోదంతో సిలిండర్ల అమ్మకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బెంగళూరు, కోల్ కతా, చెన్నై, ముంబయిలో ఐదు కేజీల సిలిండర్ ను పెట్రోల్ బంకుల్లో అమ్ముతున్నారు.